రాయలసీమ స్త్రీ రచయితల కథా ప్రస్థానం

Kinnera sridevi రాయలసీమ వెయ్యేళ్ళ సాహిత్య చరిత్రలో కథాసాహిత్య చరిత్ర 1918 లో ప్రారంభమైతే, రాయలసీమ స్త్రీ రచయితల కథా ప్రస్థానం 1927 నుండి మొదలైంది.నిజానికి 1926 లో కస్తూరి వెంకట సుబ్బమ్మ (అనంతపురం) 'కథామంజరి ' పేరుతో పౌరాణిక వస్తువుతో ' బలిచక్రవర్తి చరిత్రం ', ' భీష్మోదయం ', ' గరుడ చరిత్రం ' కథలురాశారు. కానీ ఇవి ఆధునిక జీవితాన్ని చిత్రించిన కథలు కాకపోవడం వలన కథానిక ప్రక్రియగా అంగీకరించవలసిన పని లేదు.…