కేతు విశ్వనాథరెడ్డి

‌‌ కేతు విశ్వ నాథరెడ్డి కడపజిల్లా,కమలాపురం తాలూ కా(యర్రగుంట్లమండలం) రంగశాయిపురంలో 10.7.1939న కేతు వెంకటరెడ్డి, నాగమ్మ దంపతులకు జన్మించారు. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆచార్యులు, శాఖాధ్యక్షులుగా పదవీ విరమణ చేశారు. వీరి రచనలకు తెలుగు విశ్వవిద్యాలయం (1993), కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు(1986) లభించాయి. సాహిత్య పరిశోధనకు, సాహిత్యవిమర్శకు సామాజిక శాస్త్రాల సహాయం అనివార్యమని మార్క్సిస్టులు భావిస్తారు. కేతు విశ్వనాథరెడ్డి దృష్టి అనే విమర్శ గ్రంథంలో ఈ సిద్ధాంతాన్నే ప్రతిపాదించి ఈ సిద్ధాంతం ప్రకారమే విమర్శ…