విమర్శకుని బాట

Srujana nedu,27.12.2020 సమాజంలో వున్న అనేక రుగ్మతలను చూసో, సమాజం ఇలా వుండకూడదని భావించో, సమాజాన్ని ప్రతిఫలించాలనో రచయిత రచన చేస్తాడు. ఆ రచనను చదివిన పాఠకునికి సమాజాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు వీలవుతుంది.సాహిత్యం సమాజాన్ని మార్చుతుందా? అని చాలామంది అడుగుతుంటారు. వాస్తవానికి సాహిత్యం, సామాజిక మార్పు పరస్పర సంబంధం కలిగి వుంటాయి. దీని గుర్తించిన బుద్ధుడు తన ధర్మాలను కథల రూపంలో వివరించే ప్రయత్నం చేశాడు.అలాగే ఇలాంటి ప్రయోజనం కోసమే పంచతంత్ర కథలు,ఈసప్ కథలు…

కర్షక కథా యోధుడు సింగమనేని నారాయణ. సాహితీ కసుమం నేల రాలింది. Singamaneni.

సింగమనేని నారాయణ అనంతపురంలోని బండమీది పల్లెలో సంజీవమ్మ, రామప్ప దంపతులకు జూన్ 23, 1943న సింగమనేని నారాయణ జన్మించారు. మొత్తం తొమ్మిదిమంది సంతానంలో ఈయన రెండోవాడు. వీరిది మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం.వీరితండ్రి ఆ రోజుల్లో ఫోర్త్ ఫారం వరకు చదువుకున్నారు. అందువల్ల ఆయన కొంతకాలం ఉపాధ్యాయుడిగా కూడా పని చేశారు. ఆయన చాలా పుస్తకాలు,పత్రికలు తెచ్చియిచ్చి పిల్లలందరితో చదివించి వారిలో సాహిత్య పఠనాభిలాషను పెంపొందించాడు.రెండో తరగతి నుంచే సింగమనేని చేతికి దొరికిన ప్రతి అక్షరం ముక్కనూ…