గడియారం వేంకట శేషశాస్త్రి-Gadiyaram venkata seshastry

          బహుముఖ ప్రజ్ఞాశాలైన గడియారం వేంకట శేషశాస్త్రి కడపజిల్లా జమ్మలమడుగు తాలూకా నెమళ్ళదిన్నె అగ్రహారంలో 1901లో రామయ్య, నరసమ్మ దంపతులకుజన్మించారు. రూపావతారం శేషశాస్త్రి వద్ద కావ్య నాటకా లంకారాదులను, తర్క, జ్యోతిష, వాస్తు శాస్త్రాలను అభ్యసిం చారు.దుర్భాక రాజశేఖర శతావధానితో కలిసి అవధానాలు చేసిఅవధాన పంచాననుడు'గా సన్మానాలు పొందారు. శాసన మండలి సభ్యుడుగా, సాహిత్య అకాడమీ అధ్యక్షుడుగా బాధ్యత లను నిర్వర్తించారు.          శ్రీనాధ కవితా సామ్రాజ్యము, తిక్కన కళావైదగ్యము, ఉత్తర రామాయణ కావ్యశిల్పము వీరి విమర్శనా గ్రంథాలు,ఉత్తర రామాయణము…