పాశ్చాత్య భావనలను తెలుగు సాహిత్య విమర్శకు అన్వయంచేసిన వల్లంపాటి వెంకట సుబ్బయ్య

           Vallampati venkata subbaiah 1937వ సంవత్సరంలో వల్లంపాటి వెంకట సుబ్బయ్య చిత్తూరు జిల్లారొంపిచర్లలో పుట్టారు. ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ చేశారు. బోధనా రంగానికి అవసరమైన బి.ఇడ్, ని, ఇంగ్లీషు టీచింగ్ డిప్లమా (పిజిడిటిఇ)ని అందుకున్నారు. "The Role of Indian Sensibility in the Teaching of English  Literature" అనే అంశంపై సీఫెల్ లో పరిశోధన చేసి M.Litt. పట్టా పొందారు. బెసెంట్ థియోసాఫికల్ కళాశాల,మదనపల్లిలో  చాలాకాలం పాటు ఆంగ్లోపన్యాసకుడిగా పనిచేశారు. పుట్టింది రాయలసీమలోనే…

నిరంతర సాహితీ కృషీవలుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య

Vallampati venkatasubbaiah              సాహిత్యం సమాజాన్ని జాగృతపరుస్తుంది. ప్రభావితం చేస్తుంది! ఉత్తమ సాహిత్యం వల్ల అత్యుత్తమ సమాజం ఆవిష్కృతమవుతుంది. సమాజికపరమైన అన్ని అంశాలమీదా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తన ప్రభావాన్ని చూపే సాహితీవిమర్శకు సాహిత్యంలో  ఓ ప్రత్యేకస్థానం ఉంది.తన హెచ్చరికల ద్వారా సాహిత్యాన్ని పక్కదారులు పట్టనీయకుండా, క్రమపరుస్తూ ఉత్తమ సాహిత్యంగా మలచగలుగుతున్నది విమర్శే! అందువల్ల విమర్శకులు  పరోక్షంగా సాహిత్యాన్ని  చాలా వరకు ప్రభావితం చెయ్యగలుగుతారు.             ఆధునిక సాహిత్య విమర్శకులలో చిత్తూరు జిల్లాలో ముఖ్యులు వల్లంపాటి వెంకట సుబ్బయ్యగారు. డా|| కొత్వాలు…

1928లో రాయలసీమ నామకరణం

వల్లంపాటి వెంకటసుబ్బయ్య “ దత్త మండలాలు "అన్న పేరు "రాయలసీమ" గా మారటానికి దాదాపు 128 సంవత్సరాలు పట్టింది . ప్రసిద్ధంగా ఉండేదో లేదో చెప్పటం కష్టం కానీ ఈ ప్రాంతానికి "రాయలసీమ " అన్న పేరు ఉన్నట్టు మట్టి రాజుల కాలంలో వచ్చిన " అభిషిక్త రాఘవము " అన్న తెలుగు కావ్యంలో ఉంది . తరువాత ఆ పేరు ఎందుచేత మరుగున పడిపోయిందో తెలియదు . మట్టి రాజులు విజయనగర చక్రవర్తులలాగా దక్షిణ భారతదేశాన్నంతా…