నేడు తిరుమల రావు జయంతి . సాహిత్య, సైన్స్ సమ్మిళిత శాస్ర్తవేత్త సర్దేశాయి-Tirumala rao

pic source Google ఆయన ఓ మేథావి….గొప్ప శాస్ర్తవేత్త….సాహిత్య పిపాసి….విలక్షణమైన వ్యక్తి …చాలా నిరాడంబరుడు….వృత్తిరీత్యా తైల పరిశోధనా శాస్ర్తవేత్త. ప్రవృత్తిరీత్యా సాహితీ విమర్శకుడు.సర్దేశాయి తిరుమలరావు సప్తసముద్రాల సమ్మిశ్రమ మహాసముద్రంలాంటివాడు. పుట్టింది కర్నూలు జిల్లా అయినప్పటికీ ఆయన ఉద్యోగ జీవిత మంతా అనంతపురం జిల్లా లోనే గడిచింది. అతని అనంతపురం జిల్లా సొంత వాసిగా భావించారు. తిరుమలరావు కర్నూలు జిల్లా జోహారాపురంలో 1928 నవంబర్ 28 న జన్మించాడు.తల్లికృష్ణవేణమ్మ, తండ్రి నరసింగరావు. ఆదోని,అనంతపురంలలో ప్రాథమిక,ఉన్నత పాఠశాల విద్యలు చదివాడు.…