కర్షక కథా యోధుడు సింగమనేని నారాయణ. సాహితీ కసుమం నేల రాలింది. Singamaneni.

సింగమనేని నారాయణ అనంతపురంలోని బండమీది పల్లెలో సంజీవమ్మ, రామప్ప దంపతులకు జూన్ 23, 1943న సింగమనేని నారాయణ జన్మించారు. మొత్తం తొమ్మిదిమంది సంతానంలో ఈయన రెండోవాడు. వీరిది మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం.వీరితండ్రి ఆ రోజుల్లో ఫోర్త్ ఫారం వరకు చదువుకున్నారు. అందువల్ల ఆయన కొంతకాలం ఉపాధ్యాయుడిగా కూడా పని చేశారు. ఆయన చాలా పుస్తకాలు,పత్రికలు తెచ్చియిచ్చి పిల్లలందరితో చదివించి వారిలో సాహిత్య పఠనాభిలాషను పెంపొందించాడు.రెండో తరగతి నుంచే సింగమనేని చేతికి దొరికిన ప్రతి అక్షరం ముక్కనూ…