సాళ్వ కృష్ణమూర్తి

‌‌ సాళ్వ కృష్ణమూర్తి కర్నూలు జిల్లా, అప్పటి కోవెలకుంట్ల తాలూకా. నొస్సం గ్రామంలో 1930 జూన్ నెల 26వ తేదీన జన్మించారు. తల్లి సీతమ్మ, తండ్రి వెంకట సుబ్బయ్య, బి.ఏ తెలుగులో బొబ్బిలి మహారాజావారి స్వర్ణపతకం, ఎం.ఏ తెలుగు (1950-52) ప్రధమ శ్రేణి పొందారు. సనాతన సంప్రదాయ సూత్రాలను వెతికి పట్టుకొని, వెలికితీసి ఒకశాస్త్రకావ్య సమన్వయవేత్తగా గుర్తింపు పొందారు. భారతీయ షడ్దర్శనాలైన సాంఖ్య, వైశేషిక, న్యాయయోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, ఉత్తర మీమాంసవిశేషించి జైమిని మహర్షి ప్రవర్తింపజేసిన…