శశిశ్రీ కి ఆపేరు పెట్టిందెవరో తెలుసా ? -sasisri

      Sasisri              దాదాపు అరవై వసంతాలు నింపుకొని, అస్తమించిన శశిశ్రీ, సాహిత్యా కాశంలోని శశియే! ఈయన అసలు పేరు షేక్ బేపారి రహమతుల్లా.కడప జిల్లా సిద్ధవటం జన్మస్థలం. కార్యక్షేత్రం కడప నగరం.              ఆధునిక కవిగా, జీవితాన్ని దృశ్యీకరించే కథారచయితగా, సీనియర్ జర్నలిస్టుగా మంచి పేరు పొందిన శశిశ్రీ వక్త గా కూడా ప్రసిద్ధుడు.ఈయన గురువు సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు.ఆయనే ఈయనకు ' శశిశ్రీ ' అని నామకరణం చేశారు.శశిశ్రీ చివరి రోజుల్లో తనగురువు గారి జీవిత…