కె.వి.రెడ్డి సినీ ప్రస్థానం. Kvreddy

తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత. తెలుగు సినిమా స్వర్ణయుగంగా భావించే కాలంలో పలు విజయవంతమైన, విమర్శకులు ఆణిముత్యాలుగా అభివర్ణించిన పలు సినిమాలు తీసిన దర్శకుడు. అతను దర్శకునిగా మొత్తం 14 సినిమాలు తీయగా వాటిలో 10 వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సాధించినవే. దర్శకునిగా దాదాపు మూడు దశాబ్దాల కాలం పనిచేశాడు.అనంతపురం జిల్లాలోని తాడిపత్రి సమీపంలో తేళ్ళమిట్ట పల్లెలో 1912 జూలై 1న కె.వి.రెడ్డి జన్మించాడు. అతని పూర్తి పేరు కదిరి వెంకట రెడ్డి.…

పి.యస్. రామకృష్ణారావు సినీ జీవితం.p.s.ramakrishanarao

రామకృష్ణారావు 1918, అక్టోబర్ 12 న కర్నూలులో జన్మించాడు. తన చదువులను మధ్యలోనే నిలిపివేసి 1936లో వేల్ పిక్చర్స్ సంస్థలో సహాయ ఎడిటర్‌గా సినీ రంగంలో ప్రవేశించాడు. 1939లో హెచ్.ఎం.రెడ్డి సినిమా మాతృభూమితో స్వతంత్ర ఎడిటర్ గా మారాడు. ఆ తరువాత స్టార్ పిక్చర్స్ సంస్థలో హెచ్.ఎం.రెడ్డి, హెచ్.వి.బాబు ల వద్ద సహాయదర్శకునిగా పనిచేశాడు.హెచ్.వి.బాబు దర్శకత్వం వహించిన కృష్ణప్రేమ చిత్రానికి సహకార దర్శకునిగా పనిచేస్తున్న రామకృష్ణకు, అందులో కథానాయిక భానుమతికి పరిచయం పెరిగి, అది ప్రణయంగా మారి…

సాహిత్య సేవకులు శ్రీ సిరిపి ఆంజనేయులు -Siripi anjaneyulu.నేడు వీరి జయంతి.

సిరిపి ఆంజనేయులు. సాహిత్యం మంటే మక్కువ వీరికి. తనకున్న చాలా ఆస్తి ని దానం చేసి ఎన్నో మంచి కార్యాలకు తోడ్పాటును అందించారు. ప్రకృతి వైద్యం పట్ల ఎనలేని నమ్మకం . ప్రకృతి వైద్యం గురించి విపరీతంగా ప్రచారం చేశారు. శ్రీ సిరిపి ఆంజనేయులు 1891జూన్ 1న అనంతపురం జిల్లా ధర్మవరం లో జన్మించారు.వీరి తల్లిదండ్రులు నారమ్మ , రామన్న.ధర్మవరము వీధిబడుల లోను, మిషన్ వారి పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు.కలకత్తా యందలి 'నిఖిల భారత…

కల్నల్‌ కాలిన్‌ మెకంజీ కైఫియత్తుల అధ్యయన నిపుణులు కట్టా నరసింహులు.Katta narasimhalu.

కట్టా నరసింహులు కల్నల్‌ కాలిన్‌ మెకంజీ కైఫియత్తులు అధ్యయన నిపుణులు పురాతన ఆలయాల చరిత్ర పరిశోధకులు కట్టా నరసింహులు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి దేవాలయంకు గుర్తింపు తెచ్చిన ప్రముఖులలో విద్వాన్ కట్టా నరసింహులు కూడా ఒకరు.కవి ,రచయిత పరిశోధకుడు విద్వాన్ కట్టా నరసింహులు కడప జిల్లా ఒంటిమిట్టకు రెండు కిలోమీటర్ల దూరంలోని చిన్న కొత్తపల్లి గ్రామంలో 5 ఏప్రిల్ 1947 లో జన్మించారు .వీరి ప్రాథమిక విద్య చిన్నపల్లి గ్రామంలో కొనసాగించారు. ఉన్నత పాఠశాల…

ఆంధ్రావాల్మీకి వావిలి కొలను.vaavilikolanu

వావిలికొలను. వావిలికొలను సుబ్బారావు 1863  జనవరి23న ప్రొద్దుటూరు లో జన్మించారు. తండ్రి రామచంద్రరావు. తల్లి కనకమ్మ. భార్య రంగనాయకమ్మ. నెల్లూరు శ్రీ కాంచనపల్లి శేషగిరి రావు గారిపుత్రిక శ్రీమతి రంగనాయకమ్మ.వీరికి ఒక కొడుకు పుట్టినా చిన్నతనం లోనే చనిపోయాడు .భార్య 1910లో పరమపదించారు . వావిలికొలను సుబ్బారావు కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించారని కొందరు చెబుతున్నారు వీరి జన్మస్థలంలో కొంత వివాదం నెలకొంది. ఎఫ్ఫే వరకు చదివిన ఆయన కొంతకాలం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం చేశారు. 25వ ఏటనే ‘కుమారాభ్యుదయం’ అన్న…

హనుమంతుడు లేని రామాలయం ఒకటుంది. ఎక్కడో తెలుసా?Rama temple

రామభక్తిలో పరవశించి ఆనందంగా ఉన్న ఆంజనేయులు నిత్యం రామునితో ఉంటాడు. హనుమ లేని రాముని విగ్రహాలు బహు అరుదు. దేశంలో హనుమంతుడు లేని రామాలయం ఒకటే ఒకటుంది. అంతే కాదు ఒకే శిలపై రాముడు, సీత ,లక్ష్మణుడు ఆ దేవాలయం లో కన్పిస్తారు. మూడుగోపురాలు కలిగిన దేవాలయం అది. పోతన తాను రచించిన తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం చేశారు. స్వయంగా జాంబవంతుడు ఏకశిలపై సీతారాములను,లక్ష్మణున్ని ప్రతిష్టించినట్లు చెబుతారు.అందుకే ఇది ఏకశిలానగరమని పేర్కొన్నారు. త్రేతాయుగం…

🎧🎤 స్వరరాగ గంగా ప్రవాహం జిక్కీ 🎼🎶 jikki

జిక్కీ పాట పరవశంలో తేలియాడే ప్రతి నిమిషం ఆనందంగా గడిచిపోతుంది. ప్రతి మనిషి ఏదో ఒకపాట ఏదో ఒక సందర్భంలో పులకించేలా చేసి ఉంటుంది, పరవిశించి ఉంటాడు. అదే పాట గొప్పతనం. పాట పాడి పదిమందినీ మెప్పించటం ఏమీ చిన్న విషయం కాదు. అందుకు పడే శ్రమ వినేవారికంటే పాడేవారికే ఎక్కువ. గాయనీగాయకులు గళం నుంచి సుతిమెత్తగా జాలువారే సుస్వరాల గంగాఝరి. అలనాటి మధురగీతాలు ఇప్పటి తరాన్నీ మైమరిపింప చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. రాత్రి వేళ…నిశబ్దాన్ని మీటుతూ…

✒️అక్షర ప్రస్థానం సాగించిన కలంయోధుడు ,చైతన్య దీప్తిపప్పూరురామాచార్యులు -papuru

నేడు శ్రీ పప్పూరు రామాచార్యుల వర్థంతి సందర్భంగా … రాయలసీమ అభివృద్ధి కాంక్షతో ముందుకు సాగిన సాహితీవేత్త. చైతన్య దీప్తి , రచయిత, పాత్రికేయ బృహస్పతి పప్పూరు రామాచార్యులు. రాయలసీమ ప్రముఖుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. శ్రీబాగ్‌ ఒడంబడికలో రాయలసీమకు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖులలో పప్పూరు రామాచార్యులు కూడా ఒకరు. 1896 నవంబర్ 8వ తేదీనఅనంతపురంలో పప్పూరు రామాచార్యులు జన్మించాడు. వీరి తండ్రి నరసింహాచార్యులు, తల్లి కొండమ్మ. ఇతని పూర్వీకులు పప్పూరు నుండి అనంతపురానికి వచ్చి స్థిరపడినవారు కాబట్టి…

సంజీవమ్మ,పి.

సంజీవమ్మ,పి. జూన్ 1942న సంజీవరెడ్డి, వెంకటమ్మ దంపతులకు సంజీవమ్మ జన్మించారు. తన ఉద్యోగ జీవితాన్ని 1965లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగ ప్రారంభించి, కడప జిల్లాలో ఎక్కువ కాలం, అనంతపురం జిల్లాలో కొంతకాలం పనిచేసి 1998లో ప్రిన్సిపాల్ గా విశ్రాంతి పొందారు. 1995లో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలిగా పురస్కారం పొందారు. ఆమె పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథం "తెలుగు నవలలో సామాజిక చైతన్యం'. సంజీవమ్మ తమ పరిశోధన కొనసాగించ డానికి 1977లో FIP ప్రణాళికలో ఎన్నికయ్యారు. అనంతపురం…