రాయలసీమ కవితలు2-Rayalaseema kavitalu2

పల్లవి. ఎన్నాళ్ళని వేచి ఉందువు ఓరన్న నీవు రాయలసీమరైతు సోదరా ఓరన్న నీవు రాయలసీమ రైతు సోదరా అనుపల్లవి.. చరణం 1… ఎండిపోయిన పంటభూమి ఇగిరిపోయిన నదులనీళ్ళుబతుకు నీడ్చ భారమయిన బాధతీర్చు నాథుడెవరు? మధ్యయుగం దొరలంతా దగా చేసి దండుకున్న -చేయిచాచి అడగలేదు నిలదీసి అడగలేదుమోచేతి నీళ్ళు విడిచి మొఖమెత్తి నిలవరించినిధులు నీళ్ళు నౌకరికి ఉద్యమాల బాటనడువు. "ఎన్నాళ్ళని" చరణం 2 తమిళతంబి వేరుపడగ బళ్ళారీ బాటమారెతెలుగు రాయల సంస్కృతి కన్నడరాయలగ మారెతుంగభద్ర, బళ్ళారి ఇనపగనులు విడిపోయెకర్నూలు…