వల్లూరు కోట

పుష్పగిరి తాడిపత్రి -కడప రహదారిలో యర్రగుంట్ల, కమలాపురం దాటిన తరువాత వల్లూరు అనే చిన్న పట్టణం వస్తుంది. ఇప్పుడు చిన్న పట్టణం అయినా దాదాపు 250 సంవత్సరాలు ములికినాటి సీమ ప్రధాన పట్టణాలలో ఒకటిగా, నల్గొండ నుండి కోలార్ వరకు ఒంగోలు నుండి గుత్తి వరకు విస్తరించి కొంత కాలం స్వతంత్య్ర రాజ్యంగా ఉన్న కాయస్థ రాజ్యానికి వల్లూరు రాజధాని. ప్రస్తుత కడపజిల్లా కళ్యాణీ చాళుక్యుల పాలనలో ఉండగా, కళ్యాణి చాళుక్య ప్రభువైన త్రైలోక్యమల్ల మహారాజు /…

నాలుగు ప్రాజెక్టులు_four projects

గండికోటకు మరో 10వేల క్యూసెక్కులకు టన్నెల్ గాలేరు-నగరి, హంద్రీనీవా అనుసంధానానికి రూ.5,036 కోట్లు Galeru Nagari Canal near Gandikota Reservoir                   Hundri neeva canal గాలేరు నగరి సుజల స్రవంతి పథకు నుంచిహంద్రీనీవా సుజల స్రవంతిని అనుసంధానించేలా ఎత్తిపోతల పథకాలు చేపట్టేందుకు రూ. 5,098 కోట్లతో పాలనామోదం ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన పరిశోధన, నిర్మాణ పనులు కలిపి చేసేందుకు వీలుగా…

దక్షిణ కాశి పుష్పగిరి

Pushpagiri తిరుమల , కంచితో ఒకనాడు సమానం గానూ, దక్షిణ కాశిగానూ ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. ఇక్కడ విద్యారణ్యస్వామి శ్రీచక్రాన్ని ప్రతిష్టించినారు.కడప నుండి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు ప్రక్క దారి చీలిపోతుంది. ఆ మార్గంలో పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య…