అనంతపురం జిల్లాలో ఆనకట్టలు- projects in ananthapuram

తుంగభద్ర ఎగువకాలువ         25 లక్షల ఎకరాల వర్షాధార సాగుభూమి ఉన్న ఈ జిల్లాలో ఒక లక్షా నలభైవేల ఎకరాలకు ఈ కాలువ ద్వారా సాగునీరు అందించడానికి రూపొందించారు.         ఏవిధంగా అయితే కోస్తా ప్రాంతంలో నీటి వనరులు కల్పించి కరువులను పారదోలినారో, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కూడా నీటి వనరులను కల్పించి కరువులను పారదోలాలని బ్రిటిష్ వారు ఆలోచించారు. ఆ రోజుల్లో అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలోని ఆలూరు, పత్తికొండ ప్రాంతాలు బళ్లారి…