దశాబ్దాల కాలం పాటు నీటి ఎద్దడిని ఎదుర్కొంటోన్న రాయలసీమలో మరో నీటి ప్రాజెక్టు నిర్మితం కాబోతోంది. పోతిరెడ్డి పాడు ద్వారా కృష్ణా జలాల వరద జలాలు, అదనపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం..తాజాగా మరో రిజర్వాయర్ను నిర్మించడానికి ప్రతిపాదనలను రూపొందిస్తోంది. హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా- కడప జిల్లాలో ఈ రిజర్వాయర్ను నిర్మించడానికి అవసరమైన కసరత్తు చేపట్టింది ప్రభుత్వం. రాయలసీమ నీటి ఎద్దడిని నివారించడం ద్వారా తాను…