సామాజిక తలంపై గణితసాహిత్యాల మేలుకలయికల విన్యాసం

‌ ప్రకృతిలో ఒకదానితో మరొకటి ఆధారపడి ఉన్నట్లే అన్ని శాస్త్రాలు ఒకదానికొకటి ఆధారపడి ఉన్నాయి. అయితే అన్నింటికీ అనుసంధానమైనది గణితం. అందుకే గణితం అన్ని శాస్త్రాలకు రాణి లాంటిదని కార్ల్ ఫ్రెడరిక్ గాస్ అంటాడు. దీన్నే సాపేక్షమన్నాడు ఐనిస్టీన్. Einstein విశ్వంలో ఏది స్వతంత్రంగా ఉండలేదు. ప్రతి ఒక్కటి ఇంకో దానిపై ఆధారపడి ఉంది. విశ్వం స్థల కాల సమాహారమన్నారు. ప్రపంచంలో ఏదీ ఒంటరిగా మనలేదు,ఏదోఒక సూత్రానికి కట్టుబడినట్లుఒకదానితో మరొకటి ఆధారపడి వుంటాయినీవులేక నేనెలా వుండగలనుప్రియతమా! అంటూ…

నేటివిటీ సొబగు ను పొదివిపట్టుకొని కవిత్వరచన సాగిస్తున్న పల్లిపట్టు నాగరాజు-Nagaraju Pallipattu

Pallipattu Nagaraju పల్లిపట్టు నాగరాజు కవితలన్నింటినీ కవిసంగమం లో ఫాలో  అవుతున్నాను  దగ్గరగా. యువకవుల్లో రాష్ట్రస్థాయిలో  ప్రతిభా వంతుడైన కవి పల్లిపట్టు. బడుగు వర్గాల,దళిత బహుజనుల బతుకుల్లోని కడగండ్లను కళ్ళకు కట్టినట్లు మాండలికభాష యాసల్లో ప్రాంతీయపలుకుబడి నుడికారాల నేటివిటీ సొబగు ను పొదివిపట్టుకొని కవిత్వరచన కొనసాగిస్తున్నాడు.ఇదివరకు వచ్చిన అనేక కవితలలో అత్యంత శక్తివంతమైన వ్యక్తీకరణలతో తనదైన ప్రత్యేక కవితాశిల్పంతో ప్రవహిస్తున్న కవి.ఎక్కడ అన్యాయం,సామాజికమైన అణచివేత, అగ్రవర్ణాల ఆధిపత్యధోరణి,ప్రభుత్వాల వివక్ష కనిపించినా "చిరుతపులి" లా విరుచుకుపడతాడు సత్యాగ్హంతో,ధర్మావేశంతో,విప్లవకవిలా..పవిలా.(పవి అంటే…