విమోచన పత్రిక సంపాదకుడు హెచ్చార్కె-HRK

Pic source emesco books HRK           కవి , రచయిత , పాత్రికేయులు . ప్రజా ఉద్యమాలని , సాహిత్యాన్ని జీవితంగా చేసుకున్న తరంలో ఒకరు . స్వస్థలం కర్నూలు జిల్లా , విప్లవోద్యమంలో పన్నెండేళ్లు పని చేసి  రెండేళ్లు జైలు జీవితం అనుభవించారు . విరసంలో చరుకుగా పని చేశారు . ఆ తర్వాత పాత్రికేయునిగా ప్రస్థానం . ఈనాడు దినపత్రికలో కీలక బాధ్యతలు పోషించి స్వచ్ఛంద విరమణ పొందారు . ఒక్కొక్కరాత్రి , నకులుని…

జి.వెంకటకృష్ణ- venkatakrishna

జి.వెంకటకృష్ణ కథకులు, కవి, విమర్శకులుగా ప్రసిద్ధులు. ఏది రాసినా మనసు పెట్టి రాస్తారు. నిజాయితీ నిక్కచ్చితనం ఆయన సొంతం. రాయలసీమ రచయితగా బహుజనుడిగా ఆయన రచనకు మాటకు ఎంతో విలువుంది.అనంతపురం జిల్లాలో బూడిదగడ్డపల్లె (గోరంట్ల మండలం) లో పుట్టారు. హైస్కూల్, (బెస్తరపల్లి కంబదూరు మండలం) ఇంటర్, కళ్యాణదుర్గంలోనూ చదివారు. డిగ్రీ బెంగళూరులో బెంగళూరు యూనివర్సిటీ, ఎం.ఏ. ఎం.ఫిల్ (చరిత్రలో) శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురంలో చదివారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా చేరి యిప్పుడు…

నేటివిటీ సొబగు ను పొదివిపట్టుకొని కవిత్వరచన సాగిస్తున్న పల్లిపట్టు నాగరాజు-Nagaraju Pallipattu

Pallipattu Nagaraju పల్లిపట్టు నాగరాజు కవితలన్నింటినీ కవిసంగమం లో ఫాలో  అవుతున్నాను  దగ్గరగా. యువకవుల్లో రాష్ట్రస్థాయిలో  ప్రతిభా వంతుడైన కవి పల్లిపట్టు. బడుగు వర్గాల,దళిత బహుజనుల బతుకుల్లోని కడగండ్లను కళ్ళకు కట్టినట్లు మాండలికభాష యాసల్లో ప్రాంతీయపలుకుబడి నుడికారాల నేటివిటీ సొబగు ను పొదివిపట్టుకొని కవిత్వరచన కొనసాగిస్తున్నాడు.ఇదివరకు వచ్చిన అనేక కవితలలో అత్యంత శక్తివంతమైన వ్యక్తీకరణలతో తనదైన ప్రత్యేక కవితాశిల్పంతో ప్రవహిస్తున్న కవి.ఎక్కడ అన్యాయం,సామాజికమైన అణచివేత, అగ్రవర్ణాల ఆధిపత్యధోరణి,ప్రభుత్వాల వివక్ష కనిపించినా "చిరుతపులి" లా విరుచుకుపడతాడు సత్యాగ్హంతో,ధర్మావేశంతో,విప్లవకవిలా..పవిలా.(పవి అంటే…

కదిరిలో వికసిస్తున్న కవితా మునీంద్రుడు_muneendra

Muneendra, kadiri భోగినేని మునీంద్ర జూన్ 1న 1974 లో అనంతపురం జిల్లా నల్లమాడ మండలం లోని రెడ్డిపల్లి గ్రామంలో నరసమ్మ ఓబులేసు దంపతులకు జన్మించారు. ప్రాథమిక ఉన్నత విద్య తన స్వగ్రామంలో ముగించుకొని తనకల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు కదిరి లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఎ డిగ్రీ ని 1994లో పూర్తిచేశారు అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో చరిత్రను తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగును 2001లో పూర్తి చేశారు.…

వేమన సీమలో యుద్ధభేరి మ్రోగించినసాహిత్యవిలుకాడు విద్వాన్ విశ్వం–Vidwan Viswam

విద్వాన్ విశ్వం అనంతపురం జిల్లా తరిమెల గ్రామానికి చెందిన రామయ్య, లక్ష్మమ్మ దంపతుల సంతానం విశ్వం. విద్వాన్ పట్టా పొందిన విద్వాన్ విశ్వం ప్రజలందరికీ సుపరిచితులు. 1915 అక్టోబరు 21న జన్మించిన విశ్వం వివిధ రంగాలలో రాణించారు. స్వాతంత్ర్య సమరయోధునిగా ప్రజాభిమానం చూరగొన్నారు. సాహితీవేత్తగా సాహితీపరుల హృదయాల్లో సుస్థిర స్థానం పొందారు. విద్వాన్ విశ్వం వివిధ పత్రికల్లో సంపాదకులు గా పనిచేశారు. మీజాన్, ప్రజాశక్తి, అభ్యుదయ పత్రికల్లో పనిచేశారు. భారతి సాహిత్య పత్రికలో గ్రంథ సమీక్ష శీర్షిక…