అనంత రైతులకు కుడిఎడమల నిలిచిన కవి నర్సిరెడ్డి-Narisireddy

"మీ గుండెల్లో ఎక్కడైనా/ చీమ కనుగుడ్డంత కారుణ్యముంటే/ మాక్కొంచెం తడినివ్వండి/ మా పొలాల గుండె గదుల్లోంచి/ కావల్సినన్ని గింజలు తోడి పోయకుంటే అప్పుడడగండి" అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరిన యాముల నర్సిరెడ్డి సోమందేపల్లి మండలంలోని చాకర్లపల్లి లో యాములసుశీలమ్మ , చక్కీ రప్ప దంపతులకు జూన్ 11న 1976 లో జన్మించారు.తండ్రి చక్కీరప్ప టీచర్ గా పనిచేసేవారు. అయినప్పటికీ ఆయన ఉదార స్వభావం వల్ల, వ్యవసాయానికి అధికంగా ఖర్చు చేయడం వల్ల నర్సిరెడ్డి చదువు అనేక కష్టాలకడలిలో…