1928లో రాయలసీమ నామకరణం

వల్లంపాటి వెంకటసుబ్బయ్య “ దత్త మండలాలు "అన్న పేరు "రాయలసీమ" గా మారటానికి దాదాపు 128 సంవత్సరాలు పట్టింది . ప్రసిద్ధంగా ఉండేదో లేదో చెప్పటం కష్టం కానీ ఈ ప్రాంతానికి "రాయలసీమ " అన్న పేరు ఉన్నట్టు మట్టి రాజుల కాలంలో వచ్చిన " అభిషిక్త రాఘవము " అన్న తెలుగు కావ్యంలో ఉంది . తరువాత ఆ పేరు ఎందుచేత మరుగున పడిపోయిందో తెలియదు . మట్టి రాజులు విజయనగర చక్రవర్తులలాగా దక్షిణ భారతదేశాన్నంతా…