విస్కోసిటి సృష్టించిన కళాకోవిదుడు పద్మశ్రీ కృష్ణారెడ్డి_master printmaker krishna reddy.

చతుషష్టికళల్లో చిత్రకళ ఒకటి ! ఇది దృశ్యకళ ! ఆలోచనకు నైపుణ్యాన్ని జోడించి ఒక అర్థాన్ని అందించే ఈ కళ అందరికి సాధ్యం కాదు. మనిషి ఆశాజీవి ! ఈ క్రమంలో ప్రాచీన కాలం నుండి తన దైనందిక జీవితంలో సంతోషాన్ని కొత్తదనాన్ని వెదుక్కుంటూ అందుకు వివిధ మార్గాలను అనుసరించాడు. వీటిలో కొన్ని ప్రయోజనం ఆశించి కొనసాగించాడు. మరి కొన్ని సౌందర్యదృష్టితో కొనసాగించాడు. ఈ నేపథ్యంలో చిత్రకళ అనేది ప్రయోజనాన్ని అందిస్తూనే సౌందర్యాన్ని కూడా ఒలికిస్తున్న కళ…

1967 తర్వాత 53 ఏళ్ల కు పద్మశ్రీ దక్కించు కొన్న ‘అనంత’జిల్లా-Padmashri award dalawai chalapathi rao.

అనంత కలికితురాయి దళవాయిచలపతిరావుచిన్న పల్లెటూరు ను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడమే కాకుండా ఓ గుర్తింపు తెచ్చిపెట్టాడు. భారత దేశంలో ఆ గ్రామానికి కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. దశదిశలా వ్యాపింపజేశారు. కళాసంపద సువాసనలు గుప్పించారు. అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకొని గ్రామానికేకాదు ,జిల్లా,రాష్ట్రానికే పేరు సంపాదించారు. అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలోని నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మలాట కళాకారులు దళవాయిచలపతిరావు.ఈయనకు 2020 సంవత్సరానికి కళాకారుల విభాగం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది. తోలుబొమ్మలాటకే ఓ గుర్తింపు. చలపతిరావు…