హేమావతి

మానవ ఆకారంలో సిద్ధేశ్వరస్వామిదక్షిణ భారతదేశంలోని శివాలయాల్లో శివుడు లింగాకృతిలో ఉండగా అమరాపురం మండలం హేమావతి సిద్దేశ్వరాలయంలో మానవాకృతిలో (విగ్రహం రూపంలో) కొలువుదీరడం విశేషం క్రీ. శ. 730లో నోళంబ పల్లవులు హేమావతిని రాజధానిగా చేసుకుని పాలించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో హేమావతిని యెంజేరు పట్టణంగా అనంతరం హైమవతిగా కాలక్రమేణ హేమవతిగా పిలుస్తున్నారు. ఇక్కడి ఆలయంలోని శిల్పాలు నల్లని రాతితో చూడచక్కగా మలిచారు. గ్రామంలో ఎక్కడ తవ్వకాలు చేసినా నంది విగ్రహాలు, శివలింగాలు లభ్యమవుతుంటాయి. విలువైన శిల్పాలను…