నాగపూడి కుప్పుస్వామి

నాగపూడి కుప్పుస్వామి చిత్తూరు జిల్లా వాస్తవ్యులు. వీరు నాగపూడి అనే గ్రామంలో క్రీ.శ. 1865లో జన్మించారు. వీరితండ్రి యజ్ఞనారాయణ శాస్త్రి. మద్రాసు క్రైస్తవ కళాశాలలో చదివి బి.ఏ., పట్టభద్రులై 1918 వరకు న్యాయవాద వృత్తిలోఉన్నారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య విద్యా కళాశాలకువిచారణ కార్యకర్తగా పనిచేశారు. నాగపూడి న్యాయవాద వృత్తిలో ఉన్నప్పటికీ వారికి సాహిత్య వ్యాసంగంపైన ఆసక్తి ఎక్కువ. అందువల్లనే సంస్కృతాంధ్ర సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. 1917-1938 మధ్యకాలంలో వీరు ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, భారతి,…