గల్లా చలపతి

గల్లా చలపతి 15.7.1948న వెంకటమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య కడప జిల్లా రైల్వే కోడూరులో చదివారు. నెల్లూరులో డిగ్రీ, తిరుపతిలో పి.జి. చేశారు. గల్లా చలపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలోని తెలుగు శాఖలో ఇరవైఎనిమిది సంవత్సరాలు లెక్చరరుగా, అసోసియేట్ ప్రొఫెసరుగా, ప్రొఫెసరుగా, శాఖాధ్యక్షులుగా, పి.జి. పాఠ్యప్రణాళికా సంఘ అధ్యక్షులుగా పనిచేసి ఆచార్యులుగా పదవీ విరమణ చేశారు. సంస్కృతం లోను, చరిత్రలోను కూడా వీరు ఎం.ఏ. డిగ్రీలు పొందారు. 'ఎపిగ్రఫీ'లో (శాసన శాస్త్రం)లో విశేషంగా…