సాహిత్యంపై మక్కువ పెంచే కథలు

శుకసప్తతి అంటే చిలుక చెప్పిన 70 కథలు కావచ్చు లేదా చిలుక డెబ్బైరాత్రుల్లో చెప్పిన కథలూ కావచ్చు. అయితే పాలవేకరి కదిరీపతి రాసిన శుకసప్తతిపద్యకావ్యంలో 70 కథలు లేవు, 70 రాత్రుల్లోనూ చెప్పలేదు. అయితే ఇందులోనికథలు 70 రోజులు చెప్పినట్లు కావ్యం చివర తెలుస్తూ వుంది. అంటే కొన్ని కథలులభించలేదని గ్రహించాలి.శుకసప్తతి కథ ఏంటంటే .... భర్త ఇంట్లో లేనప్పుడు భార్య ఒక మధ్యవర్తి(దూతిక) ప్రలోభంతో పరపురుషున్ని కలవడానికి ప్రయత్నిస్తూ వుంటుంది. ఆఇంట్లో ఉన్న పెంపుడు చిలుక…