సిద్ధాంత బలంగల కవి పిళ్లా కుమారస్వామి- Kumara Swami

పిళ్లా కుమారస్వామి అనంతపురం జిల్లాలో ఒక సాహితీ యాక్టివిస్ట్.సాహితీ స్రవంతి బాధ్యులు. అనంతపురం జిల్లాలో సాహితీ సంస్థలు అధికమై,రచయితలు గత కొంతకాలంగా ఎవరికి వాళ్ళుగా ఉంటున్న నేపథ్యంలో,కుమారస్వామి తనదైన పద్ధతిలో జనాన్ని సమీకరించుకొని ప్రజాసాహిత్యకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతినెలా అనంతపురంలో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. అంతేగాక కుమారస్వామి చాలా కుదురుగా తన రచనావ్యాసంగాన్ని కూడా కొనసాగిస్తున్నారు. కుమారస్వామి వామపక్షవాది. అభ్యుదయసాహితీపరుడు. అందువల్ల ఆయన సాహిత్యం అభ్యుదయ సాహిత్యంలో అంతర్భాగం.కుమారస్వామి రచించిన 50 కవితలు రాయలసీమ ప్రాంత కరువు,వ్యవసాయం,…