నిరంతర సాహితీ కృషీవలుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య

Vallampati venkatasubbaiah              సాహిత్యం సమాజాన్ని జాగృతపరుస్తుంది. ప్రభావితం చేస్తుంది! ఉత్తమ సాహిత్యం వల్ల అత్యుత్తమ సమాజం ఆవిష్కృతమవుతుంది. సమాజికపరమైన అన్ని అంశాలమీదా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తన ప్రభావాన్ని చూపే సాహితీవిమర్శకు సాహిత్యంలో  ఓ ప్రత్యేకస్థానం ఉంది.తన హెచ్చరికల ద్వారా సాహిత్యాన్ని పక్కదారులు పట్టనీయకుండా, క్రమపరుస్తూ ఉత్తమ సాహిత్యంగా మలచగలుగుతున్నది విమర్శే! అందువల్ల విమర్శకులు  పరోక్షంగా సాహిత్యాన్ని  చాలా వరకు ప్రభావితం చెయ్యగలుగుతారు.             ఆధునిక సాహిత్య విమర్శకులలో చిత్తూరు జిల్లాలో ముఖ్యులు వల్లంపాటి వెంకట సుబ్బయ్యగారు. డా|| కొత్వాలు…