కొండారెడ్డి బురుజు నిర్మించిందెవరు ? Kondareddy buruju.

రాయలసీమ ముఖద్వారం……చరిత్రకు నిలువెత్తు దర్పణం….చారిత్రక నిర్మాణ వారసత్వం…..కొండారెడ్డి బురుజు…! ఈ బురుజు చాలా సినిమాల్లో కనిపిస్తుంది. ప్రత్యేకించి కథానాయకుడు తన పొగరును పౌరుషాన్ని చూపెడుతూ తొడగొట్టి సవాల్ చేయాలి అంటే అందుకు కొండారెడ్డి బురుజు అడ్డా కావలసిందే. అప్పుడే సీన్ పండుతుంది. సినిమా జయాపజయాల మీద ప్రభావం చూపిస్తున్న ఈ బురుజుని ఎప్పుడు ఎవ్వరు నిర్మించారు అని చెప్పడానికి కచ్చితమైన శాసనాలు…లిఖిత ఆధారాలు లభ్యం కావడం లేదు.పరిశోధకులు నేటికిని అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ బురుజు నిర్మాణం విషయమై…