కేతు విశ్వనాథరెడ్డి

‌‌ కేతు విశ్వ నాథరెడ్డి కడపజిల్లా,కమలాపురం తాలూ కా(యర్రగుంట్లమండలం) రంగశాయిపురంలో 10.7.1939న కేతు వెంకటరెడ్డి, నాగమ్మ దంపతులకు జన్మించారు. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆచార్యులు, శాఖాధ్యక్షులుగా పదవీ విరమణ చేశారు. వీరి రచనలకు తెలుగు విశ్వవిద్యాలయం (1993), కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు(1986) లభించాయి. సాహిత్య పరిశోధనకు, సాహిత్యవిమర్శకు సామాజిక శాస్త్రాల సహాయం అనివార్యమని మార్క్సిస్టులు భావిస్తారు. కేతు విశ్వనాథరెడ్డి దృష్టి అనే విమర్శ గ్రంథంలో ఈ సిద్ధాంతాన్నే ప్రతిపాదించి ఈ సిద్ధాంతం ప్రకారమే విమర్శ…

కడప జిల్లా నేపథ్యం కథా రచయిత కేతు విశ్వనాథరెడ్డి-Kethu Viswanatha Reddy.

                Kethu viswanaadhareddi  ‌‌        కేతు విశ్వనాథరెడ్డి  కడప జిల్లాలో యర్రగుంట్ల మండలంలోని రంగశాయిపురం గ్రామంలో జన్మించారు. ఈయన, ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలు తిరిగి, చివరికి కడప గడప చేరారు.తన వ్యక్తిత్వపు మూలాలను, తన కథల మూలాలను కడపజిల్లాలోని పల్లెపట్టుల చరిత్రలో, తెలుగు సామాజిక పరిణామాల్లో నిరంతరం వెదుక్కుంటున్న కథకుడీయన.ఆయన కథలన్నింటికీ దాదాపు మధ్యతరగతి జీవితమే కథా వస్తువు. సీమ ప్రాంత కరువు స్థితిని తెలిపే కథలు కూడా రాశారు. రచయితకు జీవితానుభవంతో…