రాయలసీమ నుండి వచ్చిన మొట్టమొదటి దళిత కథ ‘ చిరంజీవి ‘కథ-chiranjeevi katha.

   గుత్తి రామకృష్ణ        గుత్తి రామకృష్ణ రాసిన 'చిరంజీవి'కథ సాధన పత్రికలో 1941 మార్చి 26 సంచికలో ప్రచురించబడింది.ఇది రాయలసీమలో మొట్టమొదటి దళిత కథ.అగ్రవర్ణ వ్యవసాయదారులు  దళితులకు అప్పులిచ్చి వడ్డీ మీద వడ్డీలు లెక్కలు కట్టి వాళ్ళతో వంశపారంపర్యంగా వెట్టి చాకిరీ చేయించుకొనే భూస్వామ్య దుర్మార్గాన్ని ఈ కథ బట్టబయలు చేస్తుంది . దళితులకు  స్వంత జీవితమే లేకుండా చేసిన సాంఘిక , ఆర్థిక పరిస్థితుల్ని ఈ కథ చిత్రించింది .               వెంకటరాముని ముత్తాత తన పెండ్లికి రెడ్డి…

అనువాద కథారచయిత సొంఠి జయప్రకాష్

Sonti Jayaprakash సొంఠి జయప్రకాష్ మడకశిరలో సొంఠి మెట్టు బండి రాయుడు,చిన్నామణి దంపతులకు 1. 5.1952 న జన్మించారు .వీరి ప్రాథమిక విద్యాభ్యాసం  మడకశిర లోనూ, 6 నుండి 12 వ తరగతి వరకు అనంతపురంలోని ప్రభుత్వ మల్టీపర్పస్ స్కూల్లో లోనూ పూర్తయింది. డిగ్రీలో బీకాం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో, ఎం కామ్ చదువును అనంతపురం లోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ లో దూరవిద్య ద్వారా1996 లో పూర్తి చేశారు.        1977 లో గుంతకల్…

కర్షక కథా యోధుడు సింగమనేని నారాయణ. సాహితీ కసుమం నేల రాలింది. Singamaneni.

సింగమనేని నారాయణ అనంతపురంలోని బండమీది పల్లెలో సంజీవమ్మ, రామప్ప దంపతులకు జూన్ 23, 1943న సింగమనేని నారాయణ జన్మించారు. మొత్తం తొమ్మిదిమంది సంతానంలో ఈయన రెండోవాడు. వీరిది మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం.వీరితండ్రి ఆ రోజుల్లో ఫోర్త్ ఫారం వరకు చదువుకున్నారు. అందువల్ల ఆయన కొంతకాలం ఉపాధ్యాయుడిగా కూడా పని చేశారు. ఆయన చాలా పుస్తకాలు,పత్రికలు తెచ్చియిచ్చి పిల్లలందరితో చదివించి వారిలో సాహిత్య పఠనాభిలాషను పెంపొందించాడు.రెండో తరగతి నుంచే సింగమనేని చేతికి దొరికిన ప్రతి అక్షరం ముక్కనూ…