చంద్రవదన మొహియార్- chandravadana mohi yaar.

చంద్రవదన మొహియార్ సమాధి ప్రేమ!? అవ్యక్తాను,వ్యక్తమైన ఓ తీయని మధురాతి మధురమైన అనుభూతి. మాతృప్రేమ వెలకట్టలేనిది. పితృప్రేమ శంకించలేనిది. సోదర సోదరీ ప్రేమ అమేయమైనది. ఇలా ప్రేమ యెన్నో రకాలున్నప్పటికి అందులో అగ్రతాంబూలం మాత్రం ప్రేయసీ ప్రియుల ప్రేమనే? ఎందుకంటే ప్రేయసీ ప్రియుల ప్రేమ కేవలం వొకరినొకరు ప్రేమించుకున్నంత మాత్రాన సరిపోదు. వారి పెద్దలను కూడా వొప్పించగలగాలి. అంతే కాదు సమాజం కూడా ఆ ప్రేమను ఆమోదించాలి. ఎన్ని అడ్డంకులు యెదురైనప్పటికి మొక్కవోని ధైర్యంతో ప్రతికూల పరిస్థితులను…

హంద్రీనీవా ద్వారా ప్రాజెక్టులు నింపండి.Handreneeva

హంద్రీనీవా కాలువ కదిరి ప్రాంతంలో 30వేల ఎకరాల్లో పంటలు పండించే మార్గముంది, పట్టించుకోరేం? ( చందమూరి నరసింహారెడ్డి.9440683219) కరుకు కరువుకు ఆలవాలము రాయలసీమ జిల్లాలు .ఇక్కడ నిత్యం కరువు సర్వసాధారణమే . రాయలసీమ జిల్లాల్లో అనంతపురం జిల్లాలో పరిస్థితి మరింత దారుణం. భారతదేశంలో థార్ ఎడారి తర్వాత అత్యల్ప వర్షపాతం కలిగిన ప్రాంతం అనంతపురం జిల్లా .అందువల్లనే ఈ జిల్లాలో కరువు నివారణ పథకం ఈ కార్యక్రమం కొనసాగుతోంది.నెర్రెలు బారిన నేలలు బీటలు వారిన బతుకులు అనంతపురం…

కదిరి_Kadiri

    కదిరి పరిసర ప్రాంతాలను 3 వ శతాబ్దంలో పల్లవ రాజులు, 7వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజులు పాలించారు. క్రీ.శ 985 _1076  మధ్యకాలంలో పశ్చిమ చాళుక్యులు పరిపాలించారు. కదిరి లో లక్ష్మీనరసింహాస్వామి ఆలయం నిర్మించక ముందు చాళుక్యులు క్రీ.శ. 965-1076 కాలంలో దుర్గాదేవి ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చారిత్రక కథనాల ద్వారా తెలుస్తోంది. దుర్గాదేవి విగ్రహాన్ని కృష్ణవర్ణశిలతో అతి సుందరంగా చెక్కించి తమకాలపు ప్రత్యేకతను నాటి రాజులు చాటుకున్నారు. వీరి తరువాత క్రీ.శ1191…

చంద్రవదన మొహియార్ ప్రేమ గాథ కదిరిలో జరిగిన యధార్థ సంఘటన_chandravadanamohiyar love story

       చంద్రవదన మొహియార్ ప్రేమ గాథ కదిరిలో జరిగిన యధార్థ సంఘటన.         1509_29లో శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలిస్తున్న కాలంలో పర్షియా(నేటి ఇరాన్) దేశంనుంచి కొంతమంది వజ్రాల వ్యాపారస్తులు వచ్చారు. వారు హంపీ తదితర ప్రాంతాలను చూసుకుంటూ కదిరికి కూడా వచ్చినారు.కొన్నాళ్ళు ఇక్కడ కూడా వ్యాపారం చేసినారు. ఆ వ్యాపారస్తుల్లో మొహియార్ అనే యువకుడు  ఉండేవాడు. పాతర్లపట్నంకు చెందిన శ్రీరంగరాయలు కుమార్తె చంద్రవదన ఒక రోజు కదిరికి వచ్చింది. ఆమె మొహియార్‌ను…

కదిరిలో వికసిస్తున్న కవితా మునీంద్రుడు_muneendra

Muneendra, kadiri భోగినేని మునీంద్ర జూన్ 1న 1974 లో అనంతపురం జిల్లా నల్లమాడ మండలం లోని రెడ్డిపల్లి గ్రామంలో నరసమ్మ ఓబులేసు దంపతులకు జన్మించారు. ప్రాథమిక ఉన్నత విద్య తన స్వగ్రామంలో ముగించుకొని తనకల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు కదిరి లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఎ డిగ్రీ ని 1994లో పూర్తిచేశారు అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో చరిత్రను తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగును 2001లో పూర్తి చేశారు.…