రేనాటి చోళులు కడపవాసులే

నాటి ఎరిగల్‌ ఊరే నేటి ఎర్రగుడి.వెలుగులోకి తెచ్చిన శాసనాలు రేనాటి చోళులు కడప జిల్లా వాసులేనని, రేనాటి ధనుంజయుడి తొలి రాజధాని ఎరికల్‌ అయి ఉండొచ్చునని శిలాశాసనాల ద్వారా పరిశోధకులు నిర్ధరణకు వచ్చారు. ఎరికల్‌ పదం కాలక్రమేణా ఎరికల్లు, ఎరిగల్లు, ఎరికాల్వ, ఎరిగల్‌గా రూపాంతరం చెంది ఎర్రగుడి (ఎర్రని ఇటుకలతో నిర్మించిన పాత గుడి)గా మారిందని తెలిపారు. ఎర్రగుడి ప్రస్తుతం కమలాపురంలో ఉంది. రేనాటి చోళులు కర్ణాటకలోని నిడుగల్‌ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించారన్న గత అంచనాలకు…

వై సి.వి.రెడ్డి

                                      కడప జిల్లాలోని పులివెందుల తాలూకాలోని బోనాల గ్రామంలో 1926వ సంవత్సరంలో వై.సి.వి.రెడ్డి జన్మించారు. ఈయనకు కడపజిల్లా సిపిఐ నాయకులైన ఎద్దుల ఈశ్వర్ రెడ్డి, నర్రెడ్డి శివరామిరెడ్డి,గజ్జెల మల్లారెడ్డితోనూ, రారా, సొదుంజయరాం, కేతు విశ్వనాథరెడ్డి వంటి సాహితీ మిత్రులతోనూ పరిచయం ఏర్పడంవల్ల ఈయన మార్కిస్ట్ సాహిత్యాన్ని బాగా అర్థం చేసుకున్నారు. ఆయన  మార్కిస్టు దృక్పథం తో అనేక రచనలు చేశారు.            తాను రాసిన కథల్ని 1982లో “గట్టిగింజలు' పేరుతోకథా సంకలనాన్ని తీసుకొచ్చారు. ఇందులో మొత్తం…

జి నాగయ్య

జి నాగయ్య 1976 సంవత్సరం జూలై నెల 30వ తేదీన కడప జిల్లా పులివెందుల తాలూకా లోని తాతిరెడ్డిపల్లె లో నారమ్మ,నాగప్ప దంపతులకు జన్మించారు.ఇంటర్మీడియట్ విద్యను అనంతపురం ప్రభుత్వ కళాశాలల్లో పూర్తిచేసి 1959 61 లో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరవిశ్వవిద్యాలయంలో తెలుగు పూర్తి చేశారు నాగయ్య 1992 సంవత్సరం మే నెల ఏడో తేదీన తుదిశ్వాస విడిచారు ఈయన రాసిన ద్విపద వాజ్మయము గ్రంధంలో ఎనిమిది ప్రకరణాలున్నాయి.1. ఉపక్రమణిక2. ద్విపద ఛందస్సు, విశేషాలు, ద్విపద గణాలు, దేశీయత,…

సంజీవమ్మ,పి.

సంజీవమ్మ,పి. జూన్ 1942న సంజీవరెడ్డి, వెంకటమ్మ దంపతులకు సంజీవమ్మ జన్మించారు. తన ఉద్యోగ జీవితాన్ని 1965లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగ ప్రారంభించి, కడప జిల్లాలో ఎక్కువ కాలం, అనంతపురం జిల్లాలో కొంతకాలం పనిచేసి 1998లో ప్రిన్సిపాల్ గా విశ్రాంతి పొందారు. 1995లో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలిగా పురస్కారం పొందారు. ఆమె పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథం "తెలుగు నవలలో సామాజిక చైతన్యం'. సంజీవమ్మ తమ పరిశోధన కొనసాగించ డానికి 1977లో FIP ప్రణాళికలో ఎన్నికయ్యారు. అనంతపురం…

📚సాహితీ దిగ్గజం జానమద్ది 📒

తెలుగు భాష ఉన్నంతకాలం జీవించి ఉండే సాహితీమూర్తి,సాహితీ కల్పవృక్షం, పండితుడు , అనువాదకుడు , పద్య, కవితా కథకునిగా వందలాది రచనలు చేసిన జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు ఓ సాహితీ దిగ్గజం.సాహిత్యంలో జానమద్ది హనుమచ్ఛాస్త్రి తపస్విగా నిలిచారు. ఆదర్శ జీవితాన్ని గడిపి తెలుగు భాషను మాతృభాష గా కొనసాగిస్తూ సాహిత్య రంగంలో అమరుడైయ్యారు. సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొంది తన సుదీర్ఘ రచనాకాలంలో ఎందరో పాఠకుల్ని అభిమానులుగా చేసుకుని ప్రశంసలు, పలు సన్మానాలనూ అందుకున్న సాహితీమూర్తి. తెలుగు జాతి…

సొదుం జయరాం-jayaram

సొదుం జయరాం             సొదుం జయరాంను సీరియస్ రచయితలందరూ గొప్పరచయితగా పేర్కొంటారు. ఫ్రాన్స్ రచయిత గైడీమపాసా ప్రభావం తన కథల మీద వుందనీ ఆయన చెప్పేవాడు. అందువల్లనే ఆయన కథలన్నీ నిరాడంబరంగా అత్యంత సంక్షిప్తంగా వుంటాయి. ఒక్కపదం, ఒక్క అక్షరం కూడా వృథాగా వుండకూడ దంటాడాయన. రా.రా. శిష్యవర్గంలో గురువును మించిన శిష్యుడాయన. ఆయన రాసిన 'వాడిన మల్లెలు" కథను రా.రా. ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. రా.రా.వంటి విమర్శకుల సహచర్యం ఆయనను గొప్ప రచయితగా తీర్చిదిద్దింది. పాలగిరి విశ్వప్రసాద్ వంటి…

శశిశ్రీ కి ఆపేరు పెట్టిందెవరో తెలుసా ? -sasisri

      Sasisri              దాదాపు అరవై వసంతాలు నింపుకొని, అస్తమించిన శశిశ్రీ, సాహిత్యా కాశంలోని శశియే! ఈయన అసలు పేరు షేక్ బేపారి రహమతుల్లా.కడప జిల్లా సిద్ధవటం జన్మస్థలం. కార్యక్షేత్రం కడప నగరం.              ఆధునిక కవిగా, జీవితాన్ని దృశ్యీకరించే కథారచయితగా, సీనియర్ జర్నలిస్టుగా మంచి పేరు పొందిన శశిశ్రీ వక్త గా కూడా ప్రసిద్ధుడు.ఈయన గురువు సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు.ఆయనే ఈయనకు ' శశిశ్రీ ' అని నామకరణం చేశారు.శశిశ్రీ చివరి రోజుల్లో తనగురువు గారి జీవిత…

గండికోట చరిత్ర -Gandikota history

గండికోట వైఎస్‌ఆర్ జిల్లా, జమ్మలమడుగు మండలం లోని గ్రామం.ఇది మండల కేంద్రమైన జమ్మలమడుగు నుండి పడమర దిశగా 14 కి. మీ. దూరంలో ఎర్రమల పర్వత శ్రేణిపై ఉంది.పెన్నా నదీ ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అని పేరు వచ్చింది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నదీ ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి…

తిరుమలకు తొలిగడప దేవుని కడప-Devuni kadapa.

Pic source wikipedia రాష్ట్రంలో ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలున్నాయి. వాటిలోని ప్రముఖ ప్రాంతాలలో కడప జిల్లాకు చెందిన దేవునికడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం ఒకటి విశేషఖ్యాతిగల, పురాణ ప్రసిద్ధిగల పర్యాటక ప్రాంతంగా ఈ ఆలయానికి ఎంతో పేరుంది. దీన్ని తిరుమలకు తొలి గడపగా భావిస్తారు. తిరుమల క్షేత్రపాలకుడు వరాహస్వామి అయితే, ఈ క్షేత్రపాలకుడు హనుమంతుడు. ఇలాంటి మరెన్నో విశేషాలున్నాయి. దీని గురించి కడప కైఫీయత్తు లలో సమాచారం ఉంది జనమేజయుని ప్రతిష్ఠ దేవునికడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ మూలవిరాట్ను…

25 వసంతాల బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం-cp brown library

Pic source google సి.పి.బ్రౌన్‌ (1798–1884) సుమారు 1827లో కడపలోని ఎర్రముక్కలపల్లెలో 15 ఎకరాల తోటను, ఓ పెద్ద బంగళాను వెయ్యి వరహాలకు (3500 రూపాయలకు) కొని రెండేళ్లపాటు ఆ భవనంలోనే వుండి సంస్కృతాంధ్ర పండితుల్ని సమకూర్చుకుని, తెలుగు కావ్య సముద్ధరణకు కంకణబద్దులయ్యారు. ఆ జిల్లావాడే అయిన అయోధ్యాపురం కృష్ణారెడ్డి(1800–44) ఆజమాయిషీలో ఆ పండిత కూటమి, కార్యాలయం ‘బ్రౌన్‌ కాలీజా’గా పేరు మోసింది. పరిశోధక సాహసి బంగోరె(బండి గోపాలరెడ్డి) మాటల్లో చెప్పాలంటే, సి.పి.బ్రౌన్‌ ‘‘నిలవనీడ లేకుండా పోయిన…