K.Balagopal ఇరవై ఐదేళ్ల ఉద్యమ ప్రస్థానంలో నిత్యం పాలకులతో పోరాటమే. వేలాదిమంది విద్యార్ధులకు మానవ హక్కులపై చైతన్యం రగిలించిన స్ఫూర్తి ప్రదాత. రాష్ట్రంలోని తాడిత, పీడిత జనాలకు అండగా, కార్మికవర్గాని చేదోడువాదోడుగా అటు ప్రజా వేదికలపైన, ఇటు న్యాయస్థానాల్లోనూ నిలబడిన హక్కుల నేత. హింస ఎవరు చేసినా ఒకటే దానికి వ్యతిరేకంగా నిలవడమే ఆయన లక్ష్యం. పీపుల్స్ వార్, ఫ్యాక్ష్యనిస్టులు ,పాలకులు ఎవరూ చట్టవ్యతిరేకమైన చర్యలు చేసినా పధ్ధతి కాదని హక్కులు కాలరాసే స్వేచ్ఛ ఎవరికీ లేదని…