నొలంబుల చరిత్ర తెలుసా?

దేవనహళ్ళికోట దేవనహళ్ళి తొలుత గంగవాడిలో భాగంగా ఉండేది. తరువాత ఇది రాష్ట్రకూటుల పాలనలోకి వచ్చింది. ఈ ప్రాంతాన్ని రాష్ట్రకూటులు, నోలంబులు, పల్లవులు, చోళులు, హొయసలులు, విజయనగర పాలకులు వరుసగా పాలించారు.  అనంతపురం, చిత్తూరు పరిసర ప్రాంతాలలో రాజ్యమేలిన మరో సామంత రాజవంశము వారు నొలంబులు లేక నొలంబ పల్లవులు. ఈ వంశంలో 11 మంది పాలకున్నారు. వీరు నొలంబవాడి 32 వేలు గ్రామాలు పై ఆధిత్యం వహించినారు. వీరు బాణులతో, వైదుంబులతో, చోళులతో, రాష్ట్రకూటులతో పొరు సల్పినారు.…

హేమావతి

మానవ ఆకారంలో సిద్ధేశ్వరస్వామిదక్షిణ భారతదేశంలోని శివాలయాల్లో శివుడు లింగాకృతిలో ఉండగా అమరాపురం మండలం హేమావతి సిద్దేశ్వరాలయంలో మానవాకృతిలో (విగ్రహం రూపంలో) కొలువుదీరడం విశేషం క్రీ. శ. 730లో నోళంబ పల్లవులు హేమావతిని రాజధానిగా చేసుకుని పాలించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో హేమావతిని యెంజేరు పట్టణంగా అనంతరం హైమవతిగా కాలక్రమేణ హేమవతిగా పిలుస్తున్నారు. ఇక్కడి ఆలయంలోని శిల్పాలు నల్లని రాతితో చూడచక్కగా మలిచారు. గ్రామంలో ఎక్కడ తవ్వకాలు చేసినా నంది విగ్రహాలు, శివలింగాలు లభ్యమవుతుంటాయి. విలువైన శిల్పాలను…