గంగిశెట్టి లక్ష్మీనారాయణ

గంగిశెట్టి లక్షీనారాయణ పరకల్లు గ్రామం, అనంతపురం జిల్లాలో 1947వ సంవత్సరంలో శ్రీమతి జింకా రుక్మిణమ్మ, జింకా గంగిశెట్టిలకుజన్మించారు. నేలనపడ్డ 10 నెలలకే కన్నతండ్రి గతిస్తే అంతా తానై కాపాడినవారు పితామహులు జింకా చెన్నరాయప్ప. 'విమర్శయనగా ఒక కావ్యాన్ని విషయీకరించుకొని రాయు మరొక కావ్యమ"ను రాళ్ళపల్లి గారి నిర్వచనాన్నిఆదర్శంగా తీసుకుని 'సమగ్ర సాహిత్య అధ్యయన విధానా నికి మరో పేరే విమర్శ' అని గట్టిగా నమ్మే వారిలోగంగిశెట్టి లక్ష్మీ నారాయణ ఒకరు. అన్వయ విమర్శకంటే, సైద్ధాంతి క విమర్శను…