ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, బొంబాయి యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ విభాగాన్ని స్థాపించిన వారు, ఒంగోలు సి.ఎస్.ఆర్.శర్మ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాజకీయశాస్త్రంలో రీడరు,అనేక గ్రంథాలను రచించిన రచయిత. ప్రతిభావంతులు.రాయలసీమ ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు. ప్రతాపగిరి రామమూర్తి. కడప జిల్లా నందలూరులో 1900 ఆగష్టు 25వ తేదీన ప్రతాపగిరి రామమూర్తి. జన్మించాడు. తండ్రి గోపాలకృష్ణయ్య తల్లి భ్రమరాంబ.తండ్రి గోపాలకృష్ణయ్యప్రముఖ న్యాయవాది. జాతీయ భావాలు కలవాడు. మహాత్మాగాంధీ పిలుపునందుకొని 1920లో వేలాదిమంది విద్యార్థులు తమ కళాశాల విద్యకు…