అనంతపురం జిల్లా రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా. దీని వైశాల్యం 19135 చ.కి.మీ.గోదావరి రెండు జిల్లాలంత ఉంటుంది. ఇందులో సాగు భూమి 27 లక్షల ఎకరాలు. దీనిలో ఒక లక్షా 76 వేల ఎకరాలు నీటి పారుదల పథకాల కింద ఉంటే, 55 వేల ఎకరాలు చెరువులు కుంటల కింద సాగువుతోంది.దాదాపు 88 శాతం వర్షాధారం మీద ఆధారపడి ఉంది. జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువ.గాలులు ఎక్కువ.జీవనదులు లేవు. జిల్లాలో వర్షపాతం తక్కువ. కేవలం 550మి.మీ.…
Tag: drought
కడప కరువుల చరిత్ర-kadapa drought.
Photo Courtesy:RBF-facebook కడప జిల్లా గ్రామీణ ప్రాంతాల్లోని పాతతరం వారిని మీ వయస్సు ఎంత?అని అడిగితే గంజి కరువు, లేదంటే మరో కరువులో పుట్టామని చెప్పడం నేటికీ కనబడుతుంది. కరువులు ఇక్కడి జనజీవనంలో అంతర్భాగమై పోయాయన్నవిషయం దీన్నిబట్టి స్పష్టమౌతుంది. కరువులు, రోగాలు, ఆకలి మరణాలు, వలసలు,నేరాలు, ఘోరాలు ఎన్నో... కలబంద గడ్డలు, దేదారాకు తిని ప్రాణం పట్టుకున్నకాలాలు ఎన్నెన్నో... విజయనగర పాలన మినహాయిస్తే ఆ తర్వాత వచ్చిన పాలకులు గంజి కేంద్రాలు, కరువు పనులు, రెమిషన్లు, కమిషన్లు,…