గాంధేయమే జాతికి దారి దీపం

అతడు విడిచిన బాణం - గాంధేయం అది బౌద్ధ రేఖల సమాహారం అహింసకు ప్రతిరూపం మానవాళికెప్పుడూ అది శిరోధార్యం. మిన్ను విరిగి మీద పడినా చలించని ధీరత్వానికి ప్రతీకతను. అదే నేడు సత్యాగ్రహమై నిలిచింది. నమ్మిన సత్యానికి బలైనవాడు మతోన్మాదుల గుండెలకు సింహస్వప్నమై నిలిచిన వాడు జాతీయ జెండా నిండుగా రెపరెపలాడుతోంది జనగనమణ గీతంలో ప్రతిజ్ఞా సారంలో అక్షరమై నిలిచింది ఆయనే నేటి సమాజానికి ఆదర్శం. విలువలు అఘాతంలోకి పడిపోతున్న వేళ అతని కర్రే మనకు ఆలంబన…