తాండవ నృత్యం ఏలా మొదలైందో తెలుసా ? thandavam

Thandava dance మనుషులు రోజూ పనులు చేసుకోవాలి. పని చేయంది చాలా మందికి జీవితం గడవదు. పొట్ట నిండదు. వారంతా పనిచేస్తూ కష్టాన్ని మరచి పోవాలను కుంటారు, ఏదైనా  పాటపాడుకుంటుంటే మనసు తేలికగా వుంటుంది. హాయి గొలుపుతుంది. ఇలా జానపదుల పాటలొచ్చాయి."వారు కష్టపడే టప్పుడు శరీరం కదులుతుంది. ఆ కదిలిక ఒకే తీరుగా ఉంటుంది. పోట్లు వేస్తారు. కోతకోస్తారు. కుప్పలు వేస్తారు. నూరుస్తారు. దంచుతారు. విసురుతారు. ఒక పనికి శరీరంలో ఒకే విధంగా కదిలించాలి. ఒక పనికి…

కోలాట నృత్యాలు -kolatam(stick dance)

ఆంధ్ర ప్రజాజీవితంలో అన్ని జానపద కళారూపాలతో పాటు ఈ కోలాట నృత్యం కూడ తెలుగు జానపదుల జీవితాలతో పెనవేసుకుకుపోయింది. పెద్దల్నీ, పిల్లల్నీ అందర్నీ అలరించిన కళారూపం కోలాటం. కోలాట నృత్యాలు ప్రతి పల్లెలోనూ విరామ సమయాల్లో రాత్రి పూట పొద్దుపోయే వరకూ చేస్తూ వుంటారు. భక్తిభావంతో దేవుని స్థంభాన్ని పట్టుకుని ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటి ముందూ కోలాటాన్ని ప్రదర్శిస్తారు. ఈ కోలాట నృత్యాలను పెద్ద పెద్ద తిరుణాళ్ళ సమయంలోనూ, దేవుళ్ళ ఉత్సవాలలోనూ బహిరంగంగా వీథుల్లోనూ ప్రదర్శిస్తారు.…