రాయలసీమ  దళిత జీవితం, సాహిత్యం

                చాతుర్వర్ణ  హిందూమత వ్యవస్థలో ఏ స్థాయిలోనూ చోటులేక సాంఘిక జీవన చట్రం చివరి అంచులకు నెట్టబడి వెలిగా జీవించవలసిందిగా నిర్దేశింపబడిన వాళ్లు దళితులు. అంబేద్కరిజం పునాదిగా దళితవాదం రూపు దిద్దుకొంది.కులాన్ని కేవలం ఒక సాంఘిక విషయంగా కాక ఒక రాజకీయ ఆర్థిక దళిత వాదంలో ప్రధానమైంది దళిత అణచివేత రాజకీయాలు ప్రాతిపదికగా దళిత సాహిత్యం వచ్చింది.               రాష్ట్రంలో దళిత ఉద్యమం దశదిశలా వ్యాపించినప్పటికీ, రాయలసీమలో  మాత్రం ఆ ఉద్యమం తలెత్తడం, విస్తరించడం. దళిత చైతన్యం పెరగడం వంటి…

రాయలసీమ నుండి వచ్చిన మొట్టమొదటి దళిత కథ ‘ చిరంజీవి ‘కథ-chiranjeevi katha.

   గుత్తి రామకృష్ణ        గుత్తి రామకృష్ణ రాసిన 'చిరంజీవి'కథ సాధన పత్రికలో 1941 మార్చి 26 సంచికలో ప్రచురించబడింది.ఇది రాయలసీమలో మొట్టమొదటి దళిత కథ.అగ్రవర్ణ వ్యవసాయదారులు  దళితులకు అప్పులిచ్చి వడ్డీ మీద వడ్డీలు లెక్కలు కట్టి వాళ్ళతో వంశపారంపర్యంగా వెట్టి చాకిరీ చేయించుకొనే భూస్వామ్య దుర్మార్గాన్ని ఈ కథ బట్టబయలు చేస్తుంది . దళితులకు  స్వంత జీవితమే లేకుండా చేసిన సాంఘిక , ఆర్థిక పరిస్థితుల్ని ఈ కథ చిత్రించింది .               వెంకటరాముని ముత్తాత తన పెండ్లికి రెడ్డి…