Raabiyaabi, Chiyyedu అనంతపురం జిల్లాలో ముస్లింలు ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం మొదలు కొని అన్ని జాతీయోద్యమాలలోనూ పాల్గొన్నారు. అబ్దుల్లా సాహేబ్, కాంట్రాక్టర్ సులేమాన్ సాహెబ్ , షామాలిక్ షక్కర్ బాబా , మహబూబ్ సాహెబ్ పీరా సాహెబ్, ముల్లా మోదీన్ సాహేబ్ , వీరి సతీమణి రాబియాబీ మొదలగువారుపాల్గొన్నారు. ముల్లా మోదీన్ సాహెబ్ 02-02-1917 న అనంతపురము తాలూకా, పూలకుంట గ్రామంలో జన్మించినాడు. తండ్రి ముల్లా గౌస్ సాహెబ్, తల్లి ముల్లా ఇమాంబీ.…