కాళహస్తి కలంకారీ కి పునరుత్తేజం కల్పించిందెవరో తెలుసా?Kalahasti Kalamkari.

ఇది కథ కాదు కాళహస్తి కలంకారీకి చిత్తూరు చాక్లెట్ న్యూట్రిన్ కి సంబంధం ఏమిటి? కలంకారీ కళను పునరుత్తేజం కల్పించి అంతర్జాతీయ ఖ్యాతి లభించేలా చేయడంలో ఇద్దరు స్త్రీలు ప్రధాన భూమిక పోషించారు. ఒకరు కమాలదేవి ఛటోపాధ్యాయ కాగా మరొకరు ఎవరు? బెంగళూరు మహానగరం. ఒక రోజు మూటలో వస్త్రాలు పెట్టుకుని, ఇంటటింటికీ తిరిగి అమ్ముతున్న ఒక వృద్ధుడు ఒక ఇంటి తలుపు తట్టాడు. ఈ నగరంలో అంతటా తాము నిరాదరణకు గురవుతున్నామని, తమని బిచ్చగాళ్లని చూసినట్టు…

ఆ అవార్డు ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి భారతీయునికి దక్కింది-Alan Turing award.

అలన్‌ ట్యూరింగ్‌ అవార్డు అందుకొన్న ఏకైక భారతీయుడు రాజ్ రెడ్డి చిన్న పల్లెటూరు నుంచి బాల్య జీవితం ఆరంబించి అగ్రరాజ్యంలో ఓ వెలుగు వెలుగు తున్నాడు. రాయలసీమ వాసులకు కూడ పూర్తి తెలియని ఓ గ్రామాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెలియజేశారు. మొకవోని ఆయన పట్టుదలను అభినందించాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంతగాలేని ఆరోజుల్లో ఆరంగం వైపు దృష్టి మరల్చడం ఆయన ముందు చూపుకు నిదర్శనం. యువతకు మార్గనిర్దేశకుడు డి. రాజ్ రెడ్డిఅలియాస్ రాజగోపాల్ రెడ్డి. కాటూరు అన్నది…

చిత్తూరు జిల్లా తొలి నవలా రచయిత సభా-sabhaa

సభా పశువుల కాపరి గా కష్టాలు చవిచూశారు.. కవిగా నవలా రచయిత గా ప్రజల కష్టాలు రైతుల దీనగాధలు కళ్లకు కట్టినట్టు చూపించారు. రాయలసీమ నవలా రచయితలకు ఆయనో దార్శనికుడు… తొలి తరం కథారచయిత ల్లో అగ్రజులు…పద్యం నుంచి వచనం వైపుకు, గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాష వైపుకు, గతం నుంచి వర్తమానం వైపుకు రాయలసీమ సాహిత్యాన్ని మళ్లించిన గౌరవం కే సభా, నాదముని రాజు లాంటి అభ్యుదయ రచయితల కే దక్కుతుంది. సభా చిత్తూరు…

పుంగనూరుకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?_punganur

Punganur cows                రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో లో పుంగనూరు అనే ఊరు ఉంది. పుంగనూరు అసలు పేరు పుంగ పురి. ఈ ఊరు పూర్వం పరుశురామ క్షేత్రం గా పేరుగాంచింది. చోళుల కాలంలో దీనిని పులనాడు అనేవారు.            పుంగన్ లేదా పుంగవన్ అంటే తమిళంలోమునిశ్రేష్టుడని అర్థం. ముని పుంగవుడైన వాల్మీకి ఈప్రాంతంలో నివాసం ఏర్పరుచుకున్నారని ప్రతీతి. అందుకే ఆయన పేరుతో…