అమెరికా రచయిత ఆప్షన్ సింక్లెయిర్ సాహిత్యమంతా ప్రచారమేనన్నారు.అయితే ప్రచారమంతా సాహిత్యం కాదు. సాహిత్య సంఘాల పని సాహిత్యకారులను ప్రోత్సహించడమే కాదు ప్రజాసాహిత్యాన్ని అభివృద్ధి చేయటం కూడా. సాహితీ స్రవంతి గత పదహైదు సంవత్స రాలుగా తెలుగు రాష్ట్రాలలో సాహితీ సృజన కారులను ప్రోత్సహిస్తూ సామాజిక చైతన్య సాహిత్యాన్ని ప్రోదిచేస్తూ ఉంది. అరసం, విరసంల తదనంతరం సాహిత్యోద్యమం కొనసాగించేందుకుదీక్షబూని ఉంది.“పాతది పనికిరాదు / సరికొత్త తరం కావాలి /…