దళిత పిల్లల చదువుల కోసం కృషి చేసిన కమ్యూనిస్టు యోధుడు చల్లా కృష్ణనారాయణరెడ్డి అలియాస్ సి.కె.నారాయణరెడ్డి- C.k.naranareddy.

సి.కె.నారాయణరెడ్డి పేదల పెన్నిది గా ముద్ర వేసుకొన్న మహనీయుడు…గాంధీ గా పేరుగడించిన కమ్యూనిస్టు….దళిత పిల్లల చదువు కోసం విశేషంగా కృషి చేసిన సంఘ సేవకుడు… ఆయన పేరుచెబితే గుర్తుపట్టరేమో కానీ పీలేరు గాంధీ అంటే గుర్తుపడతారు.సి.కె.గా మరికొందరికి పరిచయం. చల్లా కృష్ణ నారాయణరెడ్డి. చల్లా కృష్ణనారాయణరెడ్డి చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని రొంపిచర్ల మండలం చల్లావారిపల్లె లో ఆగస్టు 1 1925 న జన్మించారు. మదనపల్లెలో బీసెంట్‌ థియొసాఫికల్‌ స్కూల్‌&కాలేజీలో బి.ఎ వరకు చదువుకున్నారు. బిఎ రెండో…