ఎస్. గంగప్ప

ఎస్. గంగప్ప అనంతపురం జిల్లా'నల్లగొండ్రాయనిపల్లె'లో 8-11-1936న జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బి.ఏ (ఆనర్సు), ఎం.ఏ (తెలుగు) డిగ్రీలు పొందారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. వివిధ ప్రభుత్వ కళాశాలల్లో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులుగా పదవీ విరమణ చేశారు. కోలాచలం శ్రీనివాసరావు నాటక రంగానికి చేసిన అవిరళమైన కృషి గురించి చాలామందికి తెలీని రోజుల్లో కోలాచలం శ్రీనివాసరావు సాహిత్య సమాలోకనము అనే అంశం తీసుకొని పిహెచ్.డి.కోసం పరిశోధించి పుస్తకంగా…

స్వాతంత్ర్యోద్యమం – అనంతకవిత్వం – anantha kavitwam.

అనంత సాహిత్య చరిత్ర గురించి మనకు దొరికే ఆధారాలు తక్కువ. స్వాతంత్ర్యోద్యమం కాలంనాటి సాహిత్యం దొరికేది కొంత. అదీ పప్పూరి రామచారిగారి “ సాధన” పత్రికనుంచే ఎక్కువ దొరుకుతుంది. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, పప్పూరి రామాచార్యులు , విద్వాన్ విశ్వం, చిలుకూరి నారాయణ రావు, బెళ్ళూరి శ్రీనివాస మూర్తి , కుంటిమద్ది శేషశర్మ, హెచ్.నారాయణరావు , కల్లూరి వెంకట నారాయణ ,ఎ.సి. నరసింగరాజు, బత్తలపల్లి నరసింగరాజు, కలచవీడు శ్రీనివాసాచార్యులు, ఎల్లమరాజు నారాయణభట్టు, టి. గురుమూర్తి, పంచాంగం సూరప్ప, జె…