(అనంతసాగరం దినపత్రికలో ప్రచురితం) రాయలసీమ పేరుతో ఒక భౌగోళిక స్వరూపం సంతరించడం 1928 నాటికి జరిగింది.ఇనుప యుగంలో కొన్ని గ్రామ సముదాయాలతో ఉండింది ఈ ప్రాంతమంతా.జనపదాల నుంచి రాచరిక వ్యవస్థ లోకి వచ్చిన తర్వాత ఆ నాటి రాజుల శాసనాల ఆధారంగా మనకు కొన్ని సామాజిక పరిస్థితులు తెలుస్తున్నాయి. అయితే రాయలసీమ ప్రాంత సామాజిక పరిస్థితులు విజయనగర రాజుల కాలం నుండి వివిధ రచనల ద్వారా తెలుస్తున్నాయి.అందువల్ల రాయలసీమ ప్రాంతాన్ని ఆనాటి …