ప్రజాకవి కవికాకి కోగిర జై సీతారాం-Seetaram

మట్టి వాసన తెలిసిన వాడు. పల్లె మనసుల మనసెరిగినవాడు. చిన్నతనంలోనే మేకలు మేపి కష్టాలను చవి చూచినవాడు. పల్లె ప్రజల జీవనశైలి తెలిసినవాడు. కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో నివశించిన కవి. కరువు ప్రాంతం లో సాహిత్య బతుకు బండిని లాగిన వాడు. మనసున్న మన కవి ,పల్లె ప్రజల జీవన విధానాన్ని తెలిపిన కవి. కోగిర జై సీతారామిరెడ్డి. రాయలసీమ లో పేద ప్రజల మధ్యే ఉంటూ ఆ భాషను, వారి జీవితానుభవాలను పూర్తిగా జీర్ణించుకుని…

1928లో రాయలసీమ నామకరణం

వల్లంపాటి వెంకటసుబ్బయ్య “ దత్త మండలాలు "అన్న పేరు "రాయలసీమ" గా మారటానికి దాదాపు 128 సంవత్సరాలు పట్టింది . ప్రసిద్ధంగా ఉండేదో లేదో చెప్పటం కష్టం కానీ ఈ ప్రాంతానికి "రాయలసీమ " అన్న పేరు ఉన్నట్టు మట్టి రాజుల కాలంలో వచ్చిన " అభిషిక్త రాఘవము " అన్న తెలుగు కావ్యంలో ఉంది . తరువాత ఆ పేరు ఎందుచేత మరుగున పడిపోయిందో తెలియదు . మట్టి రాజులు విజయనగర చక్రవర్తులలాగా దక్షిణ భారతదేశాన్నంతా…