సోమందేపల్లి కి ఆ పేరెలా వచ్చింది. Somandapalli

అనంతపురం జిల్లా సోమందేపల్లి గ్రామానికి ఆపేరు ఎలా వచ్చిందంటే అల్లసాని పెద్దన తెలుగు కవిత్వానికి మెచ్చిన విజయనగర సామ్రాజ్యాధినేత అయినా శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దన మాతృమూర్తి అయినా శ్రీమతి సోమిదేవమ్మ పేరిట అగ్రహారంగా ఇచ్చిన నాటి సోమిదేవమ్మపల్లే నేటి సోమందేపల్లి. విజయనగర సామ్రాజ్యాధినేత విడిది క్షేత్రమైనపెనుకొండ కు సమీప లో ఈ గ్రామం ఉంది. మనుచరిత్రతో ఆంధ్రుల మనసు రంజింప చేసిన అల్లసాని పద అల్లికల స్థానమైన నాటి అగ్రహారం ఈ సోమిదేవమ్మపల్లే..నేటి సోమందేపల్లి.