దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు సంధ్యావందనం శ్రీనివాసరావు. కర్నాటక సంగీతంలో మహా విద్వాంసుడు. సంగీత కళానిధి సంధ్యావందనం శ్రీనివాసరావు ఆకాశవాణిలో భక్తిరంజని కార్యక్రమం సంధ్యావందనం హయాంలోనే ప్రారంభించబడింది.అప్పుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆలిండియా రేడియోలో సంధ్యావందనం వద్ద ప్రమోషన్ అసిస్టెంట్‌గా ఉండేవారు. ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలు ఆలపించడంలో సంధ్యావందనం శ్రీనివాసరావు ప్రసిద్ధులు. సంగీత కళారత్న సంగీత కళాచార్య ఆయన బిరుదులు. అనంతపురం జిల్లా పెనుకొండలో 1918, ఆగష్టు 21న సంధ్యావందనం శ్రీనివాసరావు జన్మించారు. తండ్రి నారాయణరావు, తల్లి…