సైన్స్ నిపుణులు శాస్త్రవేత్త శాంతప్ప-M.Santhappa.

Pic source google మారుమూల గ్రామంలో జన్మించి అరకొర సౌకర్యాలు ఉన్న పరిస్థితుల్లో వాటిని జయించి సరస్వతి పుత్రునిగా పేరు గడించారు. స్వాతంత్ర్యం కూడా రాకమునుపే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగించిన శాస్త్రవేత్త ఆయన. రాయలసీమకే కాదు దేశానికి ఎన్నో సేవలు అందించారు. వందేళ్లు పూర్తి చేసుకుంటున్న అనంతపురం ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి ఆయన. ఆర్ట్స్ కాలేజీ మణి మకుటాల్లో ఈయన ఒకరు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులు గా, శాస్త్రవేత్తగా ఆయన ఎంతో కీర్తి గడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు…