వేమన శతకకర్తనే కాదు తత్వవేత్త తెలుసా – vemana.

వేమన హేతుబద్ధతవేమనను కేవలం శతక కర్తగానే చూపించి ఆయన స్థాయిని తగ్గించారు.ఇదే వేమన వేరే దేశంలో ఉండిఉంటే గొప్ప తత్వవేత్తగా గుర్తింపు పొందేవాడు. లేదా బ్రాహ్మణ కులంలో జన్మించి ఉంటే గొప్ప సంస్కర్తగా కొనియాడబడేవాడు.. మతాలు మంచే చెబుతుండవచ్చు కానీ మతబోధకులు దొంగలంటాడు వేమన. ఆరు మతములందు నధికమైన మతంబులింగమతము కన్న లేదు భువినిలింగదార్ల కన్నా దొంగలు లేరయావిశ్వదాభిరామ వినుర వేమ. మతము వేషధార్లు మహిమీద పదివేలు.మూఢజనుల గలప మూగుచుండ్రుకొంగలు గుమికూడి కొరకవా బోదెలువిశ్వదాభిరామ వినుర వేమ.…

హేతువాది, సంఘసంస్కర్త యోగి వేమన- veemana

బంగారు లేడి ఉండదని తెలియని రాముడు దేవుడెలాగయ్యాడు? కనక మృగము భువిని కద్దులేదనకుండతరుణి విడిచిపోయె దాశరధియుతెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?విశ్వదాభిరామ వినుర వేమ. విగ్రహారాధనను విమర్శిస్తూ…. పలుగురాళ్ళు దెచ్చి పరగ గుడులు కట్టిచెలగి శిలల సేవ జేయనేల?శిలల సేవ జేయ ఫలమేమికలుగురా?విశ్వధాభిరామ వినురవేమ. కులవిచక్షణలోని డొల్లతనం గురించి…. మాలవానినంటి మరి నీటమునిగితేకాటికేగునపుడు కాల్చు మాలఅప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో?విశ్వదాభిరామ వినుర వేమ. ఆ కాలం పరిస్థితులను బట్టి చూస్తే…వేమన గొప్ప హేతువాది అని గ్రహింపవచ్చు. సమాజంలో ఎంతో దృఢంగా పాతుకుపోయిన ఆచారాలను, భావాలను…