హేతువాది, సంఘసంస్కర్త యోగి వేమన- veemana

బంగారు లేడి ఉండదని తెలియని రాముడు దేవుడెలాగయ్యాడు? కనక మృగము భువిని కద్దులేదనకుండతరుణి విడిచిపోయె దాశరధియుతెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?విశ్వదాభిరామ వినుర వేమ. విగ్రహారాధనను విమర్శిస్తూ…. పలుగురాళ్ళు దెచ్చి పరగ గుడులు కట్టిచెలగి శిలల సేవ జేయనేల?శిలల సేవ జేయ ఫలమేమికలుగురా?విశ్వధాభిరామ వినురవేమ. కులవిచక్షణలోని డొల్లతనం గురించి…. మాలవానినంటి మరి నీటమునిగితేకాటికేగునపుడు కాల్చు మాలఅప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో?విశ్వదాభిరామ వినుర వేమ. ఆ కాలం పరిస్థితులను బట్టి చూస్తే…వేమన గొప్ప హేతువాది అని గ్రహింపవచ్చు. సమాజంలో ఎంతో దృఢంగా పాతుకుపోయిన ఆచారాలను, భావాలను…